Crime ఎల్ కేజీ బాలికను ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ లైంగికంగా వేధించిన ఘటన మలుపు తిరిగింది.. ఈ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు..
బంజారాహిల్స్ లోని బిఎస్ డి డిఏవి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఓ బాలికపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై ఆ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలనీ విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. అయితే పాఠశాల గుర్తింపు రద్దుఅవటంతో ఇప్పటివరకు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ విద్యా సంవత్సరంలో నష్టపోకుండా దగ్గరలోనే ఉన్న పాఠశాలల్లో చదివే విధంగా సర్దుబాటు చేయాలని సూచించారు.. అలాగే ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను తీర్చే బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారి దేనని తెలిపారు అలాగే సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ఎందుకు గాను విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కమిటీ సక్రమంగా నడవడానికి గాను అందులో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డిఐజి స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. అలాగే ఈ కమిటీ మొత్తం విషయాలన్నిటిని విశ్లేషించి వారం రోజులు లోగా తన నివేదికను అందించాలని చెప్పారు.. ఇప్పుడు వచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలో చూస్తామని తెలిపారు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునర్వతం కాకుండా పాఠశాల యాజమాన్యం నుంచి హామీ పత్రం తీసుకుంటామని కూడా తెలిపారు..
ఈ స్కూల్ లో ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని పై అక్టోబర్ 19న డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డ్రైవర్‌ను పట్టుకుని చితకొట్టి పోలీసులకు అప్పగించారు.