Telangana News,KCR,Telangana Politics,TRS Party,
*తెలంగాణా ప్రజల జీవన రేఖ టి ఆర్ యస్*
దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం టి ఆర్ యస్ పార్టీ ఆవిర్భావం.చాలా సాదా సీదాగా ప్రారంభమయిన టి ఆర్ యస్ 20 ఏండ్లలో ఇన్ని సంచలనాలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు.ఎవరి అంచనాలకు అందకుండా ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాన్ని చేరుకున్న కేసీఆర్ నాయకత్వ లక్షణం అద్భుతం.
దుర్బేద్యమైనది అనుకున్న సమైక్య పాలనను బద్దలు కొట్టి తెలంగాణా ప్రజల కలను సాకారం చేసిన తీరు అనితర సాధ్యమైనది.నిరాశ నిట్టూర్పుల నుండి తెలంగాణ స్వాప్నికుల భయ సందేహాలను పారదోలి భిన్న దృవాలైన కుడి,ఎడమ మద్యే వాద ఆలోచనలను ,ఆలోచనా పరులను ఏకం చేసి ఉద్యమ లక్ష్యాన్ని తీరం దాటించిన అద్భుతమైన నావికుడు కేసీఆర్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కుట్రలు,కుతంత్రాలు, వెన్నుపోట్లు నిత్యకృత్యాలైనా పడి లేచిన కెరటం లాగా అన్ని ఆటుపోట్లను తట్టుకొని చివరికి నిరాహారదీక్షతో ప్రాణాన్ని ఫణంగా పెట్టి చావు అంచుల్లోకి వెళ్లి తెలంగాణా ఫలాన్ని తెచ్చిన వీరుడు కేసీఆర్.
టి ఆర్ యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో
మీ
గుంటకండ్ల జగదీష్ రెడ్డి
విద్యుత్ శాఖామంత్రి
తెలంగాణా రాష్ట్రం