Friendship : ఫ్రెండ్షిప్ డే అనగానే స్నేహం గురించి ఎంతో గొప్పగా చూపించిన సినిమాలు.. పాటలు గుర్తుకొచ్చేస్తాయి. స్నేహ బంధాన్ని అద్భుతంగా తెరపై చూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్నేహానికి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాయి. ఆగస్టు 6 ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా అలాంటి కొన్ని సినిమాల్ని గుర్తు చేసుకుందాం.
స్నేహం కోసం:
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడమంటే ఏంటో ‘స్నేహం కోసం’ సినిమాలో కనిపిస్తుంది. 1999 లో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మీనా, విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్లు నటించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరిపైకి శత్రువు అటాక్ చేయగానే అతని స్నేహితుడు అడ్డు వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుడి మరణం తట్టుకోలేక అతని స్నేహితుడు కూడా గుండె ఆగి చనిపోతాడు. ఈ సినిమాలోని సీన్ ఎప్పుడు చూసినా కంటి నీరు ఆగదు.
వసంతం:
ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య కేవలం ప్రేమ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప స్నేహం ఉంటుందని చాటి చెప్పిన చిత్రం వసంతం. 2003 లో రిలీజైంది. వెంటేష్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ సినిమా అప్పట్లో అందరినీ ఆలోచింపచేసింది.
హ్యాపీ డేస్:
కాలేజ్ లో 8 మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల సమాహారం హ్యాపీడేస్ సినిమా. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో స్నేహితుల మధ్య జరిగిన అనుభవాలు అందంగా చూపించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2007 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.
ఉన్నది ఒకటే జిందగీ:
ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోవడానికి ఒక అమ్మాయి కారణం అయితే ఆ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే కథాంశంతో 2017 లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ అందర్నీ అలరించింది. రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్ కీ రోల్స్ లో నటించారు. క్లైమాక్స్ కన్వీన్సింగ్ గా తీశాడు డైరెక్టర్.