Telugu OTT Movies, LOCKDOWN News, Telugu Web Series, Etv OTT, AHA, ZEE5 OTT, NETFLIX OTT, Telugu World Now,
FILM NEWS: కరోనా భయంతో Telugu OTT Movies కి పెరిగిన గిరాకీ
కరోనా సమయంలో థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ ఓటీటీలతో మంచి కాలక్షేపం చేస్తున్నారు. అందుకే తెలుగులో ఓటీటీ వేదికలు పెరుగుతున్నాయి. ‘ఆహా’, ‘జీ5’ లాంటి వేదికలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు ఈటీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఓటీటీను లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈటీవీ వద్ద వందల సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.
అప్పట్లో కొన్ని వందల సినిమాలను వందేళ్ల లీజుకి చాలా తక్కువ ధరకు తీసుకున్నారు.ఇవి కాకుండా ఉషాకిరణ్ బ్యానర్ పై వందకు పైగా సినిమాలను నిర్మించారు. అవన్నీ కూడా ఈటీవీలోనే చూడగలం. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఓటీటీకి మూలధనం. అయితే వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, సినిమాల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నాను. తొలి విడతగా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ ల నిర్మాణంపై ప్లాన్స్ జరుగుతున్నాయి.