Entertainment టాలీవుడ్ యాంకర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి.. టాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా ఈ యాంకర్ల పాత్ర చాలా కీలకం. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ అయిన సుమ కనకాల.. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో షోస్ చేసింది . అయితే ఈమె ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
ప్రదీప్ మాచిరాజు… ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు 2 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్ అనసూయ దాదాపు రూ.2-3లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం..
రష్మీ గౌతమ్… యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది.
రవి.. ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
శ్యామల.. టాలీవుడ్‌లో ఫేమస్ అయిన మరో యాంకర్ ఈమె.. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటుంది..
మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమచారం..