సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి థాంక్స్. ప్రొడక్షన్, నటీనటులు, ఆహా.. ఈ మూడు టీములు మంచి సమన్వయంతో ఈ సినిమా చేయడం జరిగింది. తొలి సినిమాని ఇంత చక్కగా రాసిన శాలినికి అభినందనలు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వంశీ, శర్వాతో పాటు టీం అందరికీ థాంక్స్. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చారు. ఆహా టీం అందరికీ ధన్యవాదాలు. అల్లు అరవింద్ గారికి ఈ ప్రాజెక్ట్ నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.