యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నారాయణ అండ్ కో’ టీం అందరికీ బెస్ట్ విషెస్. ట్రైలర్ ఎక్స్టార్డినరీ వుంది. చివరి పంచ్ చాలా బాగుంది. వైబ్ చాలా బావుంది. నేను ఫన్ సినిమాలు ఎక్కువ చేశాను కాబట్టి నాకు జడ్జిమెంట్ బావుందనిపించిది. ఆడియన్స్ కి కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. టైటిల్ రోల్ చేస్తున్న దేవి ప్రసాద్ గారు, ఆమనీ గారు, ఆర్తి, పూజా..టీం అందరికీ బెస్ట్ విషెస్.
దర్శకుడు చిన్నాతో పాటు టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా మీద ప్యాషన్ తో తీశారు. కంటెంట్ చాలా బావుంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మంచి టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’ తో తనకి మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు. జూన్ 30న సినిమా విడుదలవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి’’ అని కోరారు.