Actress Vinaya Prasad : ప్రముఖ నటి వినయ ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. గత 2 దశాబ్దాలుగా పలు సినిమాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటి. ఓ వైపు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈమె. తాజాగా నటి వినయ ప్రసాద్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. వినయ ప్రసాద్ ఇంట్లోకి చొరబడిన దొంగలు బెడ్ రూమ్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు.
వినయ ప్రసాద్ సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా మెరిశారు. సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరలో అడుగుపెట్టిన వినయ ప్రసాద్.. శక్తి, అనుపమ, బంగారు, ‘స్త్రీ’, నంద గోకుల, నిత్యోత్సవ, సుందరి వంటి పలు సీరియల్స్‌లో నటించారు. కన్నడలోనే కాకుండా మలయాళంలోనూ సీరియల్స్‌లో నటించాడు. ఇప్పుడు పారు సీరియల్‌లో అఖిలాండేశ్వరి పాత్రలో మెరుస్తోంది. ప్రముఖంగా కన్నడ నటి అయిన వినయ ప్రసాద్.. కన్నడ డైరెక్టర్ వీఆర్కే ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. వినయ ప్రసాద్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆమె తొలిసారిగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ఇంద్రలో చిరుకు అక్క పాత్రలో నటించారు. ఆ తర్వాత దొంగదొంగది, ఆంధ్రుడు, అడవారి మాటలకు అర్థాలు వేరులే, సరైనోడు వంటి సినిమాల్లో కూడా నటించారు.
కాగా నటి వినయ ప్రసాద్, భర్త జ్యోతి ప్రకాష్ తో కలిసి అక్టోబర్ 22న స్వగ్రామం ఉడిపికి వెళ్లారు. అక్టోబర్ 26న ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత నగదు దొంగలించారో ఏంటో అని పూర్తి వివరాలు ఈ క తెలియాల్సి ఉంది.