Thousand rupees Dosa: సౌత్ ఇండియాలో దోశె అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా మందికి ఇది అల్పాహారంగా తెలుసు. చాలా మంది టిఫిన్ సెంటర్ కు వెళ్లగానే అన్నింటి కంటే ముందుగా దోశెను ఆర్డర్ చేస్తారు. అయితే ఈ దోశెలు మహా అంటే రూ. 25 నుంచి రూ. 100 వరకు ఉంటాయి. ఇంకా స్పెషల్ దోశెలు చేసినా కానీ ఇంకో వంద రూపాయిలు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ కర్ణాటకలోని ఓ వ్యక్తి వేసే దోశె ఖరీదు అక్షరాలా రూ. 1001. నమ్మాలి అంటే చాలా వింతగా ఉంది కదా..! కానీ ఇది అక్షరాలా నిజం.
అయితే ఓ దోశెకు ఇంత ఖర్చు పెట్టాలా అనే అనుమానం మీలో చాలా మందిలో వస్తుంది కదా.. ఇంతకు ఈ దోశెలో ఏంటి స్పెషల్ అని తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా… అయితే ఈ దోశె స్టోరీ ఏంటో ఓ సారి మనం కూడా తెలుసుకుందాం. ఈ దోశె ఇంత ఖరీదు అవ్వడానికి కారణం ఒక్కటే. ఈ దోశె కు వేసిన తరువాత దీనిపై బంగారు పూత ఉండే కాగితాన్ని అంటిస్తారు. కాగితం అంటే మరలా తిన కూడనిది అనుకుంటే పొరపాటే. ఈ కాగితం తినదగిందే. అందుకే ఈ దోశెకు ‘గోల్డెన్ ఫాయిల్ ఎడిబుల్ మసాలా దోశ’ అని పిలుస్తారు.
ఇంతకీ ఈ దోశె ఎక్కడ దొరుకుతుంది అనే విషయం తెలుసుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుంది కదా.. ఈ గోల్డెన్ ఫాయిల్ ఎడిబుల్ మసాలా దోశ కర్ణాటక లోని తుమకూరు రైల్వేస్టేషన్‌కు దగ్గరలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ భోజనశాలకు వెళితే ఈ ఖరీదైన దోశను టేస్ట్ చేయవచ్చు. అయితే ఈ దోశెలకు పెద్దగా డిమాండ్ లేదని హోటల్ యజమానులు చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే వారానికి ఒకటో రెండో దోశలకు ఆర్డర్లు వచ్చేవని, ఇప్పుడు రోజుకు రెండు మూడు ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఇదే హోటల్ లో సిల్వర్ ఫాయిల్ దోశె కూడా ఉన్నట్లు తెలిపారు. దీని విలువ రూ.800 గా ఉన్నట్లు పేర్కొన్నారు.