Crime తెలిసీ తెలియని వయసు పిల్లలు సరదాగా ఆడుకోవడానికన్నా రైల్వే ట్రాక్ వరకు వెళ్లారు.. ఆ తర్వాత రాబోయే పని ప్రమాదం ఊహించక సైతం పోగొట్టుకున్నారు..
ఆదివారం కావడంతో పిల్లలంతా రైల్వే ట్రాక్ పక్కనే బెర్రీ పండ్ల చెట్టు ఉందని, అక్కడ వాటిని కోసుకొని మంచిగా తినవచ్చని.. ఓ స్నేహితుడు చెప్పడంతో నలుగురు పిల్లలు కలిసి అక్కడికి వెళ్లారు. పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని వారంతా తింటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన ట్రైన్ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదం పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్‌లో చోటు చేసుకుంది..
రైల్వే ట్రాక్‌పై పండ్లు తింటుండగా.. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. మరోక చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్‌పూర్ సాహిబ్‌లోని వలస కూలీల కుటుంబాలకు చెందిన 7 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు.. సట్లెజ్ నదిపై ఉన్న లోహాండ్ రైల్వే వంతెన సమీపం దగ్గర బెర్రీ పండ్ల కోసం వెళ్లారు. అనంతరం పండ్లు కోసుకుని రైల్వే ట్రాక్ పై కూర్చొని తింటున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన పంజాబ్ లోని ఆప్ సర్కార్ విచారణకు ఆదేశించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. సంతాపం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.