Entertainment ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకున్న చాలామంది నటీనటులు ఒక వయసు వచ్చిన తర్వాత పోటగడవడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే ఇలాంటి ఎందరో నటులు గురించి వింటూ వస్తున్నాం అయితే తాజాగా మరో నటి ఇలాంటి దేని పరిస్థితిలో ఉందని తెలిసి టాలీవుడ్ జనాలు నిద్రపోతున్నారు..
ఒకప్పుడు ఎంత మంచి స్థాయిలో బతికి తర్వాత మాత్రం రోడ్డు మీద పడిన సంగతి తెలిసిందే.. ఇలాంటి వారిలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటులు ఉండగా ఇప్పుడు మరొక నటి ఇదే పరిస్థితిలో ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది దాదాపు 150 కి పైగా చిత్రాల్లో నటించి మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకుంది ఆమె కాల్చిట్ల కోసం నిర్మాతలు సైతం ఎదురుచూసేవారు అంటే ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే ఆమె ఇంకెవరూ కాదు అలనాటి నటి పాకీజా..
ముఖ్యంగా ఈమె కమెడియన్ బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ సీన్లను ఎన్నటికీ మరిచిపోలేరు.. సినిమాలో నటించిన ఈమె అసెంబ్లీ రౌడీ లో మోహన్ బాబుతో నటించి మంచి పేరు సంపాదించుకుంది అలాగే రౌడీ ఇన్స్పెక్టర్ పెదరాయుడు వంటి సినిమాలలో సైతం మెప్పించింది.. అయితే ప్రస్తుతం ఈమే పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు మానేశాక తన సొంత ఊరు కారైకుడికి వెళ్లిపోయిందట. అయితే ఇన్ని సినిమాలలో నటించిన పాకేజాకు ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేదని తెలుస్తోంది ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని ఎవరు తనకు సహాయం చేసే పరిస్థితిలో కూడా లేరు అంటూ చెప్పుకొచ్చింది అలాగే తనకు సహాయం చేయాలని తమిళ్ నడిగర్ సంఘంతో పాటు, ఉదయనిది స్టాలిన్ ని కూడా అడిగిన ఎవ్వరు సహాయం చేయలేదని చెప్పినట్లు తెలుస్తోంది..