Tollywood Celebrities Condolences to Actor TNR, Frankly With TNR is No More, i dream interviewer TNR, Journalist TNR, Actor TNR, Latest Telugu News, Corona Patients,
కరోనాతో పోరాడి మరణించిన TNR మరణ వార్త విని సంతాపం తెలిపి విరాళాలు ఇచ్చిన పలువురు సినీ ప్రముఖులు…
కరోనా కాటుకు బలైపోయిన ఇడ్రీమ్ యాంకర్ TNR
సినీ దర్శకుడు కావాలని కలలు కని.. చివరికి అవి తీరకుండానే.. వెళ్లిపోయిన TNR
TNR కుటుంబానికి 10 లక్షల రూపాయల విరాళం అందించిన ఇడ్రీమ్ సంస్థ
TNR.. తుమ్మల నరసింహా రెడ్డి అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఆయన ఇంటర్వ్యూలే…. ఓ వైవు సినీ ప్రస్థానం, మరోవైపు జర్నలిజం ఫీల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికీ మంచి గుర్తింపు అందుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు, జార్జిరెడ్డి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే.
ఇక ఫ్రాంక్లీ విత్ TNR షోతో మొత్తంగా 189 ఇంటర్వ్యూలు చేసిన ఆయన డైరెక్టర్ తేజతో మొదటి ఇంటర్వ్యూను స్టార్ట్ చేశారు. ఇక ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో క్రేజ్ అందుకున్నారు. చివరిగా 189వ ఇంటర్వ్యూను ఐ డ్రీమ్ చైర్మన్ చిన్న వసుదేవ రెడ్డితో చేశారు.
నిజానికి TNR జర్నలిజంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోకస్ మొత్తం తన డ్రీమ్ పైనే ఉండేది. ఎలాగైనా దర్శకుడు కావాలని అనుకున్నారు. కొన్నేళ్ల క్రితం చిన్న చిన్న సినిమాలకు సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఆలీ పిట్టల దొర వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. డైరక్టర్ అవ్వాలని చాలా కలలు కనేవాడు. చాలా ఆశలుండేవి. ఎల్ బి శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ కూడా పని చేసాడు. ఇక ఇంటర్వ్యూలతో క్రేజ్ అందుకున్న తరువాత కూడా ఎలాగైనా మంచి సినిమాతో దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలని కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే కరోనా వైరస్ కారణంగా ఆయన తుది శ్వాస విడువడం బాధాకరమని సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు.
కరోనాతో పోరాడి మరణించిన TNR మరణ వార్త విని సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు …
* టీఎన్‌ఆర్‌గారి మరణవార్త విస్మయానికి గురిచేసింది. ఆయన చేసిన కొన్ని ఇంటర్వ్యూలు చూశాను. అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. – నాని, హీరో
* మీతో చేసిన రెండు సుదీర్ఘ సంభాషణలు ఇంకా గుర్తున్నాయి. మీరు కన్నుమూయడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ సంభాషణలు, ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్ యూ సర్. – విజయ్ దేవరకొండ
* టీఎన్‌ఆర్ గారి మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్‌లో బెస్ట్ ఇంటర్వ్యూ. ఆయన సన్నిహితులకు నా సంతాపం. – మంచు విష్ణు
* నమ్మలేని వార్త. నా స్నేహితుడు టీఎన్‌ఆర్ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మావల్ల కాదు. TNR ఫ్యామిలీకి 50 వేలు రూపాయలు అంద చేసారు. – డైరెక్టర్ మారుతి
* మీ ఆకస్మిక మరణం మా హృదయాలను కలచివేస్తోంది. మృదువైన మాటతీరు గల మనిషి. మిస్ యూ సర్. మీ కుటుంబానికి నా సానూభూతి. – అనిల్ రావిపూడి
* టీఎన్‌ఆర్ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి. – డైరెక్టర్ గోపీచంద్ మలినేని
* విస్మయానికి గురయ్యాను. మిస్ యూ టీఎన్‌ఆర్ గారు. – సందీప్ కిషన్
* మెగాస్టార్ చిరంజీవి TNR ఫ్యామిలీకి లక్ష రూపాయలు అంద చేసారు.
* హీరో సంపూర్ణేష్ బాబు TNR ఫ్యామిలీకి 50 వేలు రూపాయలు అంద చేసారు.
* టీఎన్‌ఆర్‌కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
యూ ట్యూబ్ ప్రముఖ వ్యాఖ్యాత, ఫిల్మ్ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) ఇటీవల కరోనా కారణంగా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీఎన్‌ఆర్ ఆకస్మిక మృతి పట్ల ప్రైమ్ షో ఎంటర్‌టైన్ మెంట్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. తమ వంతు ఆర్థిక సహాయంగా లక్షరూపాయలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధుల మాట్లాడుతూ – ‘‘టీఎన్‌ఆర్ మృతి చెందారనే దుర్వార్త మమ్మల్ని ఎంతగానో కలచి వేసింది. చాలా బాధపడుతున్నాము. ఈ దురదృష్టకర సంఘటనను మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. టీఎన్‌ఆర్ మృతికి ప్రగాఢ సాను భూతిని తెలియజేస్తూ, మా వంతుగా వారి కుంటుంబనికి ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాం. టీఎన్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు.
TNR కుటుంబానికి 10 లక్షల రూపాయల విరాళం అందించిన ఇడ్రీమ్ సంస్థ