Entertainment ఈ ఏడాది మార్చి లో విడుదలై ప్రేక్షకుల ఆదరభిమానాలు పొందిన ఆర్ఆర్అర్ మూవీ ఆస్కార్ నామినేషన్ బరిలో ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఆస్కార్ నామినేషన్ కు ఆర్ఆర్ఆర్ ను కాకుండా గుజరాతి సినిమా చెల్లో షో ను పంపించడం పై అభిమానులంతా నిరాశపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్న ఆర్ఆర్అర్ ను కాకుండా ఏ ఆదరణలేని చెల్లో షోను ఆస్కార్ నామినేషన్ పంపించడం చర్చనీయంశమైంది. అయితే ఈ విషయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు..
ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్ కు వెళ్లకపోవడం పై హీరో నిఖిల్ స్పందించాడు. “ఆర్ ఆర్ ఆర్ మూవీ నిజంగానే ఒక గొప్ప చిత్రం.. విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను నేను స్పెయిన్ లో చూసా.. అక్కడ అభిమానులంతా సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా థియేటర్లకు వచ్చారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఆస్కార్ పైన నాకు వేరే అభిప్రాయం ఉంది. ఇంతగా హిట్ అయిన చిత్రం అభిమానుల మన్ననలు పొందినా.. ఆస్కార్ కు వెళ్లకపోవడం పెద్ద విషయమే కాదు. అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరభిమానాలు పొందటమే పెద్ద విశేషం. అసలు మన సినిమాలకు ఆస్కార్ ఎందుకు.. ఆర్అర్అర్ మూవీకి ఆస్కార్ సర్టిఫికేట్ అవసరమే లేదు.. ఈ సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడో గొప్ప పేరు తెచ్చుకుంది..” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా కార్తికేయ 2 మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు హీరో నిఖిల్.