Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలు ప్రేక్షకుల్లో తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక శైలిలో విభిన్న పాత్రలు, కధాంశాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే కృష్ణ వింద విహారి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తుంది.
ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. నవంబర్ แทงบอลออนไลน์ 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. నవంబర్ 20న అర్థరాత్రి 11.25 గంటలకి అనుష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. నాగ శౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి వచ్చింది కానీ అది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.
ఇక సినిమాల విషయానికొస్తే… ఇటీవల నాగశౌర్య తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెట్రీ పలనిస్వామి పని చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.






















