Trending News : కాంతార సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆదివాసీల ఆచార సంప్రదాయల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకలను మెప్పించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్‌గా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ కి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వానికి ప్రేక్షకులే కాకుండా, సినీ ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ‘కాంతారా’ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఇందులో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్, మానసి సుధీర్, ప్రమోద్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ టెలికాస్ట్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ అధికారి కొద్దిరోజుల క్రితం ‘కాంతార’ సినిమా లోని అవతారంలో గెటప్ వేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.
విజయనగరం జిల్లాకు చెందిన తహశీల్దార్ ప్రసాదరావు కాంతార దైవ రూపంలో నాట్యం చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గుంటూరు లోని నాగార్జున విశ్వ విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పన్నుల శాఖ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వేదికపై కాంతార చిత్రం లోని వరాహ రూపం పాటకు నాట్యం చేసి మొదటి బహుమతి గెలుచుకున్నందుకు నెటిజన్లు అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కూడా ‘కాంతారా’ సినిమాలో లాగా వేషం వేసుకుని రావడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Loved #Kantara? A tahsildar in #AndhraPradesh recreated the epic dance by @shetty_rishab at a culture fest for revenue dept. Prasad Rao is a tahsildar from Kothavalasa & an avid movie buff. No surprises that he won the 1st prize. #kantaramovie 1/2 pic.twitter.com/E139HHBMsR
— Krishnamurthy (@krishna0302) November 18, 2022