Entertainment మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్… తన మాటలతో ప్రేక్షకులను మైమరపించాడు. సినీ ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు ఉంటే చాలు చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఏంటి.. ఆ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తో ఏం చేశాడో తెలుసుకుందాం..
లవర్ బాయ్ తరుణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా నువ్వే నువ్వే. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, సునీల్, ఎమ్మెస్ నారాయణ, అనిత చౌదరి, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు వచ్చిన అడ్వాన్స్ ను చెక్ రూపంలో అందుకున్నానని… ఆ డబ్బులతో ఓ బైక్ కొనుగోలు చేశానాని ఆయనే స్వయంగా గతంలో చెప్పుకొచ్చారు.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రవి కిషోర్ తనలో ఉన్న రచయితను గుర్తించి.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు..
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి..