Politics టిఎస్ఆర్టిసి అప్పుడు భక్తుల కోసం పలు రాయితీలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే అలాగే దసరా సంక్రాంతి వంటి పండగలు వచ్చినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తూనే ఉంది… అలాగే ప్రస్తుతం అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా శబరిమలకు పోతున్న సందర్భంగా వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల వేసిన భక్తులు ఎక్కువగా ఉన్నారు వీరంతా మాలాధారణ అనంతరం శబరిమల పోయి అయ్యప్ప స్వామిని దర్శించుకొని వస్తారు.. అందుకే ఎక్కడ చూసినా రైలు బస్సులు జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి… వీరి కోసం ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ స్వామిల అవస్థలను గుర్తించిన టిఎస్ఆర్టిసి ఈ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది…
డిసెంబర్ జనవరిలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు పలు రాయితీలు కల్పించింది టీఎస్ఆర్టీసీ.. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు ఎక్కే బస్సులో ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులో ఏర్పాటు చేస్తామని తెలిపారు.. అలాగే ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారికి, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామన్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నారు. ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపనున్నారు. బస్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కోసం శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల కోసం www.tsrtconline.in సంప్రదించాలని సూచించారు.