Political విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశానికి అవసరం’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని తమ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఉండవల్లి అరుణ్ కుమార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సదస్సులో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు..
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈ పరిరక్షణకు భారీ సామాన్ నిర్వహించే డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా సూచించారు.. సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం చెబుతున్న కారణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల ఆకాంక్షలతోపాటు అవసరాలను కూడా కేంద్రం గుర్తించాలని నారాయణమూర్తి అన్నారు విశాఖ ఉక్కు అమ్మకం ఆంధ్ర ప్రజల మనోభావాలను ఎంతగానో దెబ్బతీస్తుందని దస్తూరి కమిటీ నివేదికను కచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించడం అంటే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లాగానే చిక్కుల్లో మునిగినట్టే అని తెలిపారు అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని భావనను రోజురోజుకు కోల్పోతున్నామంటూ తమ బాధను వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై ఈ ప్రైవేటీకరణను ఆపాలని అప్పుడే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ఈ ఆస్తిని ఆంధ్రప్రదేశ్లో కాపాడుకోగలుగుతారని అన్నారు