Entertainment సమంత సినిమాలతో మంచి బిజీగా ఉన్న సమయంలోనే కొంత గ్యాప్ తీసుకున్న సమంత కారణం ఏమై ఉంటుందో అంటూ ఆమె అభిమానులు తెగ హైరానా పడిపోయారు.. అలాగే మధ్యకాలంలో కొన్నాళ్లు మాస్క్ పెట్టుకొని తిరిగిన సమంత ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైపోయారు అయితే ఆమె చర్మ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని వార్తలు కూడా వినిపించాయి వాటికి తగినట్టుగానే సమంత కూడా కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా నడిపింది అయితే మళ్లీ తిరిగి వచ్చిన సమంత తాజాగా ఓ యాడ్ చేసింది ఇందులో ఆమె పూర్తిగా మారిపోయి కనిపించింది ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ప్రస్తుతం సినిమాలతో ఫుల్ జోష్ గా ఉన్న సమంత ఒకసారి గా కనిపించకుండా వెళ్లిపోవడం ఫాన్స్ ను నిరాశ గురి చేసింది ఆమెకి ఏమైందో అంటూ కంగారుపడిన అభిమానులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్తున్నట్టు ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చారు అయితే ఆమె తాజాగా డ్రోల్స్ ఇండియా అనే ఒక బ్రాండ్ కు ప్రమోషన్ చేసిన ఓ యాడ్ లో తన ఫేస్ చాలా వరకు చేంజ్ అయినట్టు కనిపించింది అయితే ఫిజిక్ పరంగా కాకుండా ఫేస్ లో మాత్రం చాలా చేంజ్ కనిపించిందని మెజారిటీ పీపుల్ అంటున్నారు.. అయితే అసలు విషయం ఏంటనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు..
ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలు ఉన్నాట్లు కనిపిస్తున్నాయి… విజయ్ దేవరకొండతో కలిసి శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమాలో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ తో పాటు హిందీలో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది..