Sabja drink : ఎండాకాలంలో కొన్నిచిట్కాలు పాటిస్తు , జాగ్రత్తలు తీసుకుంటే బరువు త్వరగా తగ్గవచ్చు . అందులో కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. చిన్న చిట్కాతో చాలా వరకూ బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మరి అదేంటో తెలుసుకోండి.
ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం బరువు పెరగడం ,బరువు ఎక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే చాలా మంది ఫిట్‌గా మారాలనుకుంటారు. దీని కారణంగా యాక్టివ్ ఉండడమే కాకుండా అందంగా కనిపిస్తారు కూడా. కేవలం అంధం కోసమే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి, అందుకే బరువుని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బరువు తగ్గేందుకు ఉండే చిట్కాల్లో సబ్జా కూడా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
సబ్జా నీరు..
ఎండాకాలంలో సబ్జా నీటిని చాలా మంది తీసుకుంటారు. దీని వల్ల దాహం తీరడమే కాదు. ఇది వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. ఈ నీటిని తాగితే బెల్లీ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్ని సబ్జానీటిని పరగడపున తాగాలి.
వెయిట్ లాస్ డ్రింక్..
బాడీలోని కొవ్వుని కరిగించే డ్రింక్..
కావాల్సిన పదార్థాలు..
ఓ గ్లాసు మంచినీరు , టేబుల్ స్పూన్ సబ్జా ,నీటిలో సబ్జా గింజల్ని వేసి 15 నిమిషాల పాటు నానబెట్టి తాగొచ్చు, అలాగే కొంచం షుగర్ వేసుకుంటె టేస్ట్ వల్ల త్వరగా ఇష్టపడతాం .
బరువు తగ్గేందుకు..
సమ్మర్‌లో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ నీటిని తీసుకోవాలి. దీని వల్ల బరువు తగ్గుతారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ చెబుతోంది. దీని వల్ల జీవక్రియ పెరిగి హైడ్రేషన్ తగ్గుతుంది. ఆకలి కూడా తగ్గుతుందని పరిశోధనలో తేలింది.