Health చిన్నపిల్లలకు కచ్చితంగా వ్యాక్సిన్లు వేయించాలి. ఇది వారి నూరేళ్ల జీవితానికి భరోసా ఇస్తాయి జీవితాంతం కొన్ని రకాల అనారోగ్యాల బారిన వారు పడకుండా ఉండాలి అంటే పుట్టగానే వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం. అయితే దీనికి సంబంధించి తల్లి తండ్రికి ఎన్నో అనుమానాలు ఉంటాయి ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యం సరిగా లేని సమయంలో వ్యాక్సిన్లు వేయించవచ్చా లేదా అని భయం ఉంటుంది..
పిల్లలు పుట్టిన వెంటనే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వ్యాక్సిన్ వేయించే సమయంలో పిల్లలకు దగ్గు జలుబు జ్వరం వంటివి ఉంటే కొన్ని రోజులపాటు వ్యాక్సిన్ ను వాయిదా వేయటమే మంచిది. కానీ వాయిదా వేసే విషయంలో కూడా డాక్టర్ సలహా తప్పనిసరి కొన్ని వాక్సిన్లు డాక్టర్లు వాయిదా వేయవచ్చని చెప్తారు కానీ మరికొన్నిటిని అప్పుడే వేయించాల్సి ఉంటుంది . అలాగే తేలిక పాటి జలుబు ఉన్నప్పుడు అది కొన్ని రోజులకి దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో మాత్రం వ్యాక్సిన్ వేయించవచ్చు కానీ ఏదైనా వైరల్ ఫీవర్ విపరీతమైన దగ్గు జలుబు ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి..
పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వాళ్లకు ముఖ్యంగా 12 రకాల వ్యాక్సినేషన్లు వేయించాలి.. అందులో మీజిల్స్, బీసీజీ, టీబీ,హెపిటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి, డయేరియా, మంప్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.. చికెన్‌పాక్స్, డిఫ్తీరియా, టెటనస్, పెర్టూసిస్ వ్యాక్సీన్, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి వ్యాక్సీన్, ఇన్‌ఫ్లూయెంజా టీకా, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సీన్, జపనీస్ ఎన్సెఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) టీకా, మీజిల్స్, మంప్స్ వ్యాక్సీన్, మెనింగోకోకల్ వ్యాక్సీన్, న్యూమోకోకల్ టీకాలను మరిచిపోకుండా పిల్లలకు ఇప్పించాలి.