TELANGANA COVID NEWS: కరోనా బాధితులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తున్న “వేదం ఫౌండేషన్”
Vedam Foundation, Free Food For Covid Patients, Aravind Alishetty, Corona Crisis, Covid 2nd Lockdown, Telangana 2nd Lockdown Covid News,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన వారికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఇమ్మునిటి పెరిగి తొందరగా కోలుకునే అవకాశం ఉంది కానీ కొన్ని వందల మంది సరి అయిన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. తన జీవితంలో చూసిన ఎన్నో అనుభవాల ద్వారా పేదల కష్టం తెలిసిన వ్యక్తి గా వేదం ఫౌండేషన్ అధినేత అరవింద్ అలిశెట్టి అందరి ఆకలి తీర్చడానికి.ముందుకు వచ్చారు..
గత కొన్ని రోజులుగా కరోనా బాధితులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తోంది వేదం ఫౌండేషన్..
ఇప్పటికే ప్రతిరోజూ 300 మందితో మొదలైన ఈ సేవలు ఇప్పుడు ప్రతిరోజూ 1000కి వరకు అందిస్తున్నారు..
హైదరాబాద్ లోని గాంధీ, ఫీవర్, నిలోఫర్, కోఠి హాస్పిటల్స్ దగ్గర ఉన్న కరోనా బాధితులతో పాటు వైద్య సిబ్బందికి, బాధితుని కుటుంబ సభ్యులకు భోజనాన్ని అందిస్తున్నారు, ముందుగా నమోదు చేసుకున్న బాధితులకు వాళ్ల ఇంటి వద్దకే ఉచితంగా చేరవేసేందుకు స్విగీ, జోమోటో ద్వారా అందిస్తున్నారు..
అంతే కాదు కేవలం కరోనా బాధితులకు మాత్రమే కాదు వాళ్లకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కూడా సమయానికి ఆహారాన్ని అందిస్తున్నారు.. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో వీలైనంత సేవ చేసేందుకే నడుం బిగించింది వేదం ఫౌండేషన్.. Lockdown కొనసాగినన్ని రోజులు తమ సేవలు కొనసాగుతాయని, భోజనం కావాల్సిన వారు ముందుగా తమ అడ్రెస్స్ నీ భాదితులకు తెలియ చేయాలని కోరుతున్నారు అరవింద్ అలిశెట్టి..
వేదం ఫౌండేషన్
+91 9985588821
+91 9985588831
+91 9985588841