Vidyaranya Maha Samasthanam Hampi, Go Maha Khetram, Go Sena Foundation, Yuga Tulasi Foundation, TTD K Shiva Kumar,
BHAKTHI NEWS: “గో మహా క్షేత్రం”ని ప్రారంభించిన హంపీ పీఠాధిపతి “శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ మహా స్వామీజీ”
“జాఫర్ గూడ, బాట సింగారంలో ఘనంగా ప్రారంభమైన గో మహా క్షేత్రం”
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రోడ్లమీద నిరాశ్రయంగా సంచరిస్తున్న అనాధ గోవులను, కబేళాలకు అక్రమంగా తరిలిస్తున్న గోవులను రక్షించి, వాటికి వైద్యం, ఆహారం అందించి,వాటిని దేవాలయాలకు, ఆర్ధిక స్థోమత, గోవుపట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న గో బంధువులకు ఉచితంగా అందించే యుగతులసీ “గో మహా క్షేత్రం ” జాఫర్ గూడా గ్రామం, బాట సింగారం, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం అయింది.
యుగతులసీ & గో సేన పౌండేషన్స్ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కొలిశెట్టి శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన గో మహా క్షేత్రానికి హంపీ విరూపాక్ష పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానంద భారతీ మహా స్వామీజీ కరకరముల చేత షెడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్ల మీద నిరాశ్రయంగా సంచరిస్తున్న గోవులు ఎక్కడ కనిపించినా గో మహా క్షేత్రానికి తరలించాల్సిందిగా యుగతులసీ & గోసేన పౌండేషన్స్ చైర్మన్ శ్రీ కొలిశెట్టి శివకుమార్ గో బంధువులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యుగతులసీ ప్రతినిధులు, గో బంధువులు పాల్గొన్నారు.
🙏 Jai Gowmatha 🙏