Entertainment లేడీ సూపర్ స్టార్ నయనతార-స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నయనతార కెరీర్ పరంగా ఎంత పాపులర్ అయిందో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే పాపులర్ అయింది.. నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే నయనతారసరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మనిచ్చి మరింత హాట్టాపిక్గా మారారు. ఈ విషయం అప్పుడు పెద్ద వివాదానికే దారి తీసింది. అయితే తగిన ఆధారాలు చూపించి నయనతార దంపతులు ఆ వివాదం నుంచి బయటపడ్డారు. తాజాగా ఇప్పుడీ జంట మరోసారి వైరల్ అయ్యింది.
ఎందుకంటే కొత్త కోడలిపై ఆమె అత్త చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కోడలిని తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. “మా అబ్బాయి మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, నా కోడలు ఓ స్టార్ హీరోయిన్. వాళ్లు ఇద్దరూ కష్టపడే వ్యక్తిత్వం కలవారే. నా కోడలు అయితే చాలా మంచి మనస్తత్వం కల అమ్మాయి. వాళ్ల ఇంట్లో పనిచేసే వాళ్లలో ఒకళ్లు రూ.4 లక్షల అప్పు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతుండగా.. ఆ విషయం తెలుసుకుని వాళ్ల అప్పు తీర్చేసింది. 10 మంది మనుషులు చేసే పనిని నయనతార ఒక్కతే చేస్తుంది. ఇల్లుని చక్కదిద్దుకోవడం, పెద్దవాళ్లను చూసుకోవడం ఆమెకు బాగా తెలుసు. ఇద్దరికీ వారి వృత్తి అంటే అపారమైన గౌరవం. వాళ్ల వృత్తిలో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తారు” అంటూ కోడలని ప్రశంసలతో ముంచెత్తారు.