Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో విజయ్ రాబోతున్నాడు. సమంత కూడా శాకుంతలం ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుండటంతో ఇద్దరికీ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అని భావిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. తాజాగా నిన్న ఖుషి ట్రైలర్ రిలీజయింది.
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.
విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలన్నా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇటీవల పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారితో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తుంటాను. కొంతమంది లైఫ్ లో జరిగే సంఘటనలు చూసి పెళ్లి అంటే భయపడకూడదు. పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి. అది అందరూ ఆస్వాదించాలి. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ముడేళ్ళల్లో నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే అందరికి చెప్తాను అని తెలిపాడు. విజయ్ దేవరకొండని చేసుకోబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరో చూడాలి మరి.