Movie టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే ప్రభాస్ అభిమానులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆది పురుష్ టీజర్ నిన్న ఆదివారం రాత్రి విడుదలైంది. దీనిపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.ఈ సినిమా టీజర్ లో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ పనితనంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.మోషన్ క్యాప్చర్ పద్ధతిలో తీస్తున్నామంటూ.. పేలవమైన యానిమేషన్ వర్క్ ని చూపించారనే విమర్శలు వస్తున్నాయి.. సినిమాను ఎంతగానో ఎలివేట్ చేశారని అయితే ఇందులో అంత సీన్ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ అయినట్లు కామెంట్స్ పెడుతున్నారు.
సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ శ్రీరాముని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు టీజర్ లో వీరిద్దరూ ఒళ్లంతా రుద్రాక్షలు ధరించి ఉండటం మరొక చర్చనీయం అయింది.. అంతా కలిసి రామాయణాన్ని చెడగొడుతున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. రామాయణంను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సరైన విధంగా తీయలేకపోతున్నారని ట్రోల్ చేస్తున్నారు. రామాయణ మహాభారతం వంటి పౌరాణికాలను తెరకెక్కించాలంటే కేవలం తెలుగు వారికి మాత్రమే సాధ్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.