Viral News : భిన్న మతాలకు నివాసం అయిన మన భారతదేశంలో పలు మతాలు, పలు కులాలు ఉన్నప్పటికి వారిలో హిందువులకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మతంలో దేవుళ్ళనే కాదు ప్రకృతి లోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం ఉంది. అందుకు ఉదాహరణగా ప్రస్తుత కాలంలో వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం, ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక వార్తలను తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిలాల్లో వింత సంఘటన చోటు చేసుకుంది.
పవిత్ర కార్తీక మాసం వేళ జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి పలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగా, సగం మాత్రమే తెరిచి ఉన్నట్టుగా ఉంటాయి. కాగా నవంబరు ఆఖరి కార్తీక సోమవారం కావడంతో నిన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దీంతో ఈ విషయం చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్లు తెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.