Viral News : అమెరికా లోని మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ మిల్లర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో అరుణ ఘన విజయం సాధించారు. అరుణ మిల్లర్ స్వస్థలం… కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం లోని వెంట్రపగడ గ్రామం. దీంతో ఆ గ్రామంలోని వారంతా ఆమె విజయం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు కేక్ కట్ చేసిన అరుణ బంధువులు… అనంతరం గ్రామస్తులు, బంధువులు మిఠాయిలు తినిపించుకుంటు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ… అగ్ర రాజ్యంలో అరుణ అరుదైన గౌరవం సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అరుణ విజయంతో మారుమూల గ్రామమైన వెంట్రప్రగడకు ఎంతో పేరు వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేరీ ల్యాండ్ లో బాలలందరికి విద్య, మహిళలకు సమాన అవకాశాలపై అరుణ చేసిన కృషికి అక్కడి ప్రజలు పట్ట కట్టారని అరుణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియా అంటే ఆమెకు ఎంతో ఇష్టమని, వెంట్రప్రగడ వచ్చినప్పుడు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనేదని గ్రామ పెద్దలు తెలిపారు.
తమ గ్రామానికి పేరు తెచ్చిన అరుణ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అమెరికాలో ఉంటున్నా అరుణా మిల్లర్ మన సాంస్కృతి సాంప్రదాయాలను మరచిపోలేదని వెంట్రపగడ గ్రామస్తులు అంటున్నారు. అరుణా మిల్లర్, ఆమె తండ్రితో వారికి ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.