Viral News : ప్రేమించడానికి ఎంత ధైర్యం కావాలో తెలీదు కానీ ప్రేమను తెలియజేయడానికి మాత్రం తల ప్రాణం తోకకు దిగివస్తుందనడంలో సందేహం లేదు. కొంత మంది మంచి సందర్భం చూసి ప్రపోజ్ చేయాలని చూస్తుంటారు. పైగా ప్రపోజ్ చేయడానికి చాలా మంది చాలా రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. కవిత రాసి ప్రపోజ్ చేయడం, గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేయడం, ప్రేమ లేఖతో ప్రపోజ్ చేయడం ఇలా పలు రకాలుగా ప్రపోజ్ చేస్తారు. సినిమాల్లో అయితే మంచి సెటప్, సాంగ్ ఇలా అన్నీ సెట్ చేసుకొని ప్రపోజ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి నిజజీవితంలో కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి అదే స్టైల్లో ప్రపోజ్ చేసి అందరితో నవ్వులు పూయిస్తున్నాడు.
తన ప్రేయసికి ఓ రేంజ్‌లో ప్రపోజ్ చేశాడు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గర్లో తన ప్రేయసికి ప్రపోజ్ చేసి అందరినీ అబ్బురపరిచాడు. వావ్ ఫ్యాక్టరీ ప్యారిస్ అనే పేజ్‌లో దీన్ని షేర్ చేయడం జరిగింది. “మ్యారీ మీ” అని పూలతో నేల మీద అందంగా రాసి… గులాబీ రేకులు కొవ్వొత్తులతో సెటప్ చేశాడు. ఆ తర్వాత షారుక్ ఖాన్ కోయీ మిల్ గయాకి పాటకి డాన్స్ చేస్తూ తన ప్రేమని వ్యక్తపరిచాడు. ఆమె కూడా నాలుగు స్టెప్పులు వేసింది.
ఆ తర్వాత డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఆమె అతని ప్రేమకి ఓకే చెప్పేసింది. ఆ తర్వాత ముద్దులతో ఈ జంట సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఎంతో అందంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటూ ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేయగా 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.