Viral Video జింకలు.. లేళ్లు చూస్తే ఎవరికైనా బలే ముచ్చటగా అనిపిస్తుంది.. అవి చెంగుచెంగుమని గెంతుతుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. పురాణాలు, యానిమేషన్ మూవీలు చూసినప్పుడు అందులో జింకలు సరస్సుకు వచ్చినట్టు అందులో నీళ్లు తాగినట్టు చూపిస్తారు. వాటిని చూసినవాళ్ళంతా ఆ కాలంలో మనం ఉన్నా బాగున్ను.. ఎంత ఆహ్లాదంగా ఉందో అనిపిస్తూ ఊహల్లో తేలుతారు. మరి అలాంటి సంఘటనే కళ్ళ ముందు కనిపిస్తే నోరు వెల్ల పెట్టకుండా ఉంటారా..
చుట్టూ పచ్చని పొలాలు.. అందులో ఓ చిన్న సరస్సు.. అక్కడికి వచ్చిన లేళ్లు చెంగుచెంగుమని గెంతుతూ అందులో దిగి నీళ్లు తాగుతుంటే చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అలాంటిది భూమ్మీద అసలు ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది.. ఉంటే అక్కడికి వెళ్లాలి అనిపిస్తుంది కదా నిజమే ఇలాంటిది ఉంది.. ఇందులో జింకలు.. బ్రియంజ్ సరస్సు లో నీళ్లు తాగుతున్నాయి. చుట్టూ అందమైన అడవి, పచ్చ గడ్డి, స్వచ్ఛమైన నీరు, మనసు దోచుకునే లేళ్ళు ఇదంతా అద్భుతంగా వుంది. ఇది చూసిన వాళ్లంతా ఆ వీడియోను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఫ్రెండ్ గా మారింది అంతేకాకుండా అతి కొద్ది రోజుల్లోనే 19 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అంతేకాకుండా ఇది చూసిన వాళ్లంతా అబ్బా ఎంత బాగుంది.. అక్కడ మనం ఉంటే బాగుండు.. నైస్ వీడియో.. రిలాక్సింగ్ వీడియో అంటూ కామెంట్స్ పెడుతున్నారు..
https://twitter.com/buitengebieden/status/1576160103719632896?s=20&t=wieUzQxF7j7IjWqE5toHDA