Wear Mask. Rachakonda CP Mahesh Bhagavath, Covid Latest News, Corona Cases, Telangana Police News,
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కరోనా పై సూచనలు
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలని రాచకొండ సిపి మహేష్ భగ్వత్ తెలిపారు. ఈ రోజు రాచకొండ కమిషనరేట్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలి, మాస్కులు ధరించని వారిపై ఈ చలాన్ ద్వారా కేసు నమోదు చేసి 1000 జరిమానా విధిస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తాము. నిన్న మాస్క్ దరించని 832 మందిపై కేసులు నమోదు చేసాము. రాచకొండ పోలీసులు కూడా కరోనా వైరస్ పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్త వహించండి. అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ లు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని రాచకొండ సిపి ప్రజలను కోరారు .