Whatsapp: ప్రపంచం లోనే అత్యధిక మంది ఉపయోగించి ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ సరి కొత్త ఫీచర్లతో మార్కెట్లో దుమ్ము రేపుతుంది. ఇతర మెసేజింగ్ అప్లికేషన్ లకు గట్టి పోటీ ఇచ్చే క్రమంలో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీంతో వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగానే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్లికేషన్‌ను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే సరికొత్త ఫీచర్లను అందుబాటులో ఉంచిందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వాట్సాప్ తీసుకుని వచ్చిన సరికొత్త ఫీచర్ ఏంటి అంటే కమ్యూనిటీస్. ఈ ఫీచర్ ను వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్ గ్రూపులతోనే సందేశం ఎక్కువ మందికి చేరేది. అయితే కొత్త గా తీసుకుని వచ్చిన ఈ కమ్యూనిటీస్ తో ఒకే సారి ఎక్కువ మందికి సమాచారం అందించవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. కొద్ది రోజుల వరకు ఈ కమ్యూనిటిస్ ఫీచర్ పై వాట్సాప్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పని చేశారు. అనంతరం దీనిని బీటా వర్షన్ లో విడుదల చేశారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు మార్క్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్ లో వచ్చి మరిన్ని మార్పులు కూడా యూజర్లకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం తక్కువ మందికే వీడియో కాలింగ్ ఆప్షన్ పరిమితం కాగా ఇప్పుడు మాత్రం అది 32 మందికి చేరింది. అంతేగాకుండా ఫైల్స్ షేరింగ్ కెపాసిటిని కూడా పెంచారు. తాజా ఫీచర్ల ప్రకారం ఇప్పుడు 2 జీబీ ఉన్న ఫైల్ ను కూడా పంపుకోవచ్చు.