ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది
- బ్రదర్ అనిల్ క్రిస్టయన్ సంఘాలతో భేటీ.. ఓటు వెయ్యొద్దనడంతో మొదలు
- షర్మిళతో ఆస్తి తగాదాలున్నాయనే ప్రచారానికి అడ్డుకట్ట వేయలేక పోవడం
- తల్లి విజయమ్మ దూరమవుతున్నా పట్టించుకోకపోవడం
- బాబాయి హత్య కేసులో నింద మీద పడుతుంటే వివరించకపోవడం
- అమరావతి విషయంలో మొదట ఒక మాట తర్వాత ఒక మాట అనడం
- మూడు రాజధానుల అంశంలో సరైన అవగాహన లేకపోవడం
- అనుక్షణం కోర్టు కేసులు ఎదుర్కున్న అపవాదు మీద పడ్డం
- బటన్ నొక్కడం నెగిటివ్ గా మారుతున్నా పట్టించుకోకపోవడం
- సంక్షేమాల వల్ల ఏపీ శ్రీలంక అవుతుందన్న మాటకు కౌంటర్ ఇవ్వకపోవడం
- అవినాష్ భారతి మధ్య ఏదో ఉందన్న మాటకూ సమాధానం లేకపోవడం
- ప్రజావేదిక కూల్చివేత నుంచి చంద్రబాబు అరెస్టు వరకూ కక్ష సాధింపు పేరు పడ్డం
- పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన పదే పదే చేయడం
- ప్రభుత్వ పథకాల సమయంలో రాజకీయ ప్రత్యారోపణలు చేయటం
- మీడియా ముందుకే రాకుండా ఆయన ఏదనుకుంటే అది చెప్పడం
- ఎమ్మెల్యేల బదిలీల విషయంలో వ్యతిరేకత పట్టించుకోక పోవడం
- వైనాట్ 175 వంటి అతి ఆత్మవిశ్వాస ప్రకటనలు గుప్పించడం
- కొడాలి నాని, రోజా, పేర్ని నాని వంటి వారి చేత ఓవరాక్షన్ చేయించడం
- విపరీత నిరంకుశ ధోరణి మీద ప్రచారం జరుగుతున్న పట్టించుకోక పోవడం
- సజ్జల వంటి వారి ద్వారా నష్టం జరుగుతున్నా గుర్తించక పోవడం
- కోటరీ ద్వారా తనకు చేరాల్సిన సమాచారం చేరక పోవడం
- అందరు ఎంపీలున్నా.. కేంద్ర స్థాయిలో ఎలాంటి ఫలితం రాబట్టక పోవడం
- అవసరం ఉన్నా లేని సంక్షేమ పథకాలిచ్చి చెడ్డ పేరు సాధించడం
- తనకంటూ ఒక ముమ్మర మీడియా పవర్ లేక పోవడం
- కొన్ని విషయాల్లో పూర్తి క్లారిటీ ఇవ్వక పోవడం
- సంక్షేమ పథకాలు కొందరికిచ్చి కొందరికి ఇవ్వక పోవడం
- ఒకసారి ఇచ్చి మరోమారు రాని వారి వ్యతిరేకత కూడగట్టుకోవడం
- తనకంటూ ఒక థింక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకోవడంలో వైఫల్యం
- ఇటు మీడియా, అటు రాజకీయ అనుభవజ్ఞుల అండ లేక పోవడం
- ఉన్న మీడియాను సైతం పూర్తిగా వాడలేని దౌర్భల్యం కలిగి ఉండటం
- వర్మలాంటి కేరెక్టర్ లెస్ పర్సన్స్ ద్వారా సినిమాలు తీయాలనుకోవడం
- టార్గెట్ లెస్ వర్క్ మెన్ షిప్ ను కలిగి ఉండడం
- డబ్బులిస్తే జనం ఓట్లు వేస్తారన్న పిచ్చి భ్రమల్లో బతకడం
- సొంత కుటుంబమే కాదు.. కులం కూడా దూరమవడం
- ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల అండను అతిగా ఊహించుకోవడం
- పేదరిక నిర్మూలనే ప్రమాణికంగా తీసుకుని ఊహల్లో బతకడం
- ఖర్చుకు పెట్టుబడికి వ్యత్యాసం అస్సలు తెలసుకోక పోవడం
- జగనామిక్స్ అంటే కేవలం సంక్షేమ పథకాలే అన్న నమ్మకాల్లో మనిగితేలడం
- సంపద సృష్టి అనే పదానికి అసలు సిసలు నిర్వచనం తెలీక పోవడం
- తనకు ప్రజల మద్దతు ఉంటే చాలన్న భ్రమల్లో సంచరించడం
- కేడర్ ను పూర్తిగా నిర్వీర్యం చేసుకుని వారికెలాంటి మేలు చేయకపోవడం
- కార్యకర్తల ఆర్ధిక స్తోమత సన్నగిల్లుతున్నా పట్టీపట్టనట్టు వ్యవహరించడం
- మీడియానే కాదు సోషల్ మీడియాను సైతం పట్టించుకోకపోవడం
- తనపై నింద వస్తున్నా కౌంటర్ వేయకుండా నిలువరించడం
- 151 సీట్ల గెలుపు కేవలం తన ద్వారా మాత్రమే సాధ్యమైందని నమ్మడం
- ఈసారి కూడా తన బొమ్మే గెలుస్తుందన్న గుడ్డినమ్మకం
- పవన్ని తిడుతున్నంత సేపూ కాపులు రగిలిపోవడం
- కాపు ఓటు శాతం ఫ్యాక్టర్ బలంగా పని చేయడం
- మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో చేయకపోవడం
- ట్రిపుల్ ఆర్ జగన్ ఒంటెత్తు పోకడను ఎండ గడుతుంటే.. ఏం చేయలేకపోవడం
- ఈసీ సహకారం అటు వైపు పెరుగుతుంటూ ఏం చేయలేని నిస్సహాయత
- కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేయలేక పోవడం
- కనీసం సొంత మీడియాను సైతం బలంగా తీర్చిదిద్దలేకపోవడం
- యువత నిరుద్యోగ సమస్యను సీరియస్ గా తీసుకోక పోవడం
- ఓవరాల్ గా బ్యాలెట్ ముందు బొక్కబోర్లాపడ్డం…..తో పరాజయం సంపూర్ణం
ఇవాళ ఏం జరిగిందో అర్ధంకానంత గుర్తించలేనంత గందరగోళంలో పడి కన్నీటిపర్యంతం కావడం చరిత్రలో కనివిని ఎరుగని ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడం