Crime ఇంట్లో చాలాకాలంగా పనిచేస్తున్నారు కదా నమ్మకంగా ఉన్నారని నమ్మి ఇంటి తాళాలు అప్పగిస్తే ఇల్లు మొత్తం ఊడ్చేసింది.. ఓ కిలేడి.. ఈ షాకింగ్ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
చాలా కాలంలో ఇంట్లో పని చేస్తున్నారు కదా మనతో మంచిగా ఉంటున్నారు నమ్మకంగా ఉంటున్నారని ఇంట్లో పని చేసే వాళ్ళని నమ్మకూడదు. అందరూ అలాగే ఉంటారని కాదు కానీ కొందరు మాత్రం కచ్చితంగా మోసబుద్ధి చూపిస్తారు ఇంట్లో పని చేసే వాళ్లపైన కచ్చితంగా నిగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగే నమ్మి ఇప్పటికే అందరం మోసపోయిన ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురిచేస్తుంది..
విశాఖపట్నం పీఎం పాలెం లో ఉంటున్న ఓ మహిళ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తనకు సహాయంగా ఉంటారు కదా అని ఇద్దరు మహిళలను పనిలో పెట్టుకుంది వాళ్ళు ఆమెతో నిత్యం ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆమె బాగోగులు చూసుకునేవారు ఆమెని ఎంతలా నమ్మించారు అంటే తన ఇంటి తాళాలను సైతం మిర్చి ఎక్కడికైనా వెళ్లే అంతగా నమ్మకం కుదుర్చుకున్నారు.. అయితే ఓసారి నమ్మి ఇంటి తాళాలు ఇచ్చి బయటకు వెళితే వచ్చేటప్పటికి బీరువాలో ఉన్న నగలు అన్ని ఊడ్చేశారు ఏం చేయాలో పాలు పోనీ బాధితురాలు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో నిందితులను పట్టుకున్నారు..