Entertainment బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. 1988లో నవంబర్ 28న హిమచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో జన్మించింది. ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందే ఫేమస్ స్కీన్ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తి యాడ్ లో తెగ పాపులర్ అయ్యింది. టెలివిజన్ లో యాడ్స్ ద్వారా కెరీర్ ఆరంభించిన యామీ గౌతమ్ ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపై సందడి చేసింది. తాజాగా ఈ భామ పెళ్ళి పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
కన్నడలో ఉల్లాస.. ఉత్సాహ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీలో ఏక్ నూర్, విక్కీ డోనర్, సనమ్ రే, కాబిల్, సర్కార్ 3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. నువ్విలా.. గౌరవం.. యుద్ధం.. కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే అందం, టాలెంట్ ఉన్నా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రాకపోవతడంతో.. గతేడాది జూన్ 4న డైరెక్టర్ ఆదిత్య ధార్ను పెళ్లి చేసుకుంది…
యామీ గౌతమ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కేరీర్ ముగిసిందనుకోవడం పొరపాటే అవుతుంది. అన్ని ఇండస్ట్రీల్లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కేరీర్ లో దూసుకుపోతున్న హీరోయిన్లు ఉన్నారు. సినీ కేరీర్ కు పెళ్లి ఏమాత్రం అడ్డు కాదనేది గ్రహించాలి.
ప్రతి మహిళ తన లైఫ్ లో ఎన్నో డ్రీమ్ ను నెరవేర్చుకోవాలనుకుంటుంది. అందులో పెళ్లి ఒకటి. పెళ్లి తర్వాత మరింత బాధ్యగా వ్యవహరిస్తారే తప్పా.. వారి సినిమాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. లైఫ్ పార్టనర్ అర్థం చేసుకుంంటే కేరీర్ సాఫీగా వెళ్లిపోతుందంటూ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ తో యామీ గౌతమ్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం యామీ గౌతమ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.