Political వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలకు ఎంతగా ధైర్యం నూరు పోస్తున్న వైసీపీ నేతలు మాత్రం తమదైన రీతిలో రెచ్చిపోతూనే ఉంటున్నారు.. ఒక్కడిగా నిలబడి పవన్ ఎంతలా పోరాడుతున్నా.. నిజాయితీకే నిలబడి తన జీవితాన్ని ధారపోస్తున్న.. అది ఏమీ పట్టడం లేదు ఈ నేతలకు.. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మరోసారి మాటల తూటాలు పేల్చారు వైసీపీ నేతలు..
ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ అంత పద్ధతిగా భేటీ అయి వచ్చిన తర్వాత కూడా మోడీతో భేటీ తర్వాత పవన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయని బాగా డల్ గా మారిపోయారని అంబటి మాటల్ని ఆయుధంగా తీసుకొని మాట్లాడుతున్నారు మంత్రి రోజా.. జగనన్న ఇళ్లు, పేదల కన్నీళ్లు కార్యక్రమం పేరు మార్చుకోవాలనీ. జగనన్న ఇళ్లు- పవన్ బాబుల కన్నీళ్లంటూ వీరీ కార్యక్రమానికి ట్యాగ్ లైన్ తగిలించుకోవడం మంచిదంటూ.. కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్..
అలాగే ఎంపీ చంద్రశేఖర్ “పవన్ కి కేఏ పాల్ కీ పెద్ద తేడా ఏం లేదనీ. అక్కడ మునుగోడు ఎన్నికల్లో పాల్ ఎలాంటి కామిక్ బిహేవియర్ చూపారో.. ఇక్కడ పవన్ కూడా సరిగ్గా అలాంటి వ్యవహారశైలితోనే ముందుకు నడుస్తున్నారంటూ వ్యంగ్యంగా స్పందించారు.. అయితే వీటన్నిటికీ జనసేన కార్యకర్తలు తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నప్పటికీ మానసికంగా జనసేన ను దెబ్బతీయాలని వారు చేస్తున్న ప్రయత్నాల ముందు ఓడిపోతూనే ఉన్నారు..