లక్నో: చారిత్రాత్మక 1857 భారత స్వాతంత్ర్య ఉద్యమ మహువా డాబర్, బస్తి, ఉత్తరప్రదేశ్ పోరాట స్ఫూర్తి గీతాన్ని శ్రీ ముఖేష్ మేష్రం , ప్రత్యేక కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు లక్నోలో ఒక ప్రత్యేక సమావేశం లో విడుదల చేసారు. విప్లవవీరుడు పిరయ్ ఖాన్ నాయకత్వం లో 1857 లో జరిగిన ఈ పోరాటం జరిగింది. ఆంగ్లేయులు ఎంతో మంది దేశభక్తుల గృహాలకు నిప్పంటించి సజీవంగా వారిని చంపారు. ఎంతో మంది దేశభక్తులను ఉరి తీశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆ సంఘటనను ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డా.గజల్ శ్రీనివాస్ తన స్వీయ సంగీత సారథ్యం లో గానం చేసిన మహువా డాబర్ స్ఫూర్తి హిందీ గీతాన్ని అజాది అమృత మహోత్సవానికి అంకితం చేశారు. ఈ గీతాన్ని జలంధర్, పంజాబ్ కు చెందిన కల్నల్ తిలక్ రాజ్ రచించారు.