Entertainment కొన్ని సినిమాలు విడుదలకు ముందే హైప్ ను క్రియేట్ చేస్తాయి అలాగే కచ్చితంగా హిట్ కొడతాయి అని ధీమాతో వస్తాయి అయినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం విజయం సాధించలేక పోతాయి అలాగే ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలు ఏంటంటే..
ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించారు అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వద్ద బోల్తా పడింది.. అలాగే ఇదే ఏడాది మెగాస్టార్ నుంచి వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రం మాత్రం మంచి విజయాన్ని అందుకుంది..
అలాగే డార్లింగ్ ప్రభాస్ పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చిందని చెప్పాలి డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు..
అలాగే అక్కినేని నాగ చైతన్య రాశి కన్నా అవికా గోర్ మాళవిక నాయర్ ప్రధాన పాత్రలో నటించిన థాంక్యూ చిత్రం 22న విడుదలైంది దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు
అలాగే నితిన్ కృతి శెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం కూడా విడుదలకు ముందే హైట్ ని క్రియేట్ చేసినప్పటికీ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది..
అలాగే మైక్ టైసన్ ను తీసుకువచ్చి యాక్ట్ చేయించిన తెలుగు చిత్రం టైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా గోరకాయ పరాజయాన్ని చూసింది అంతేకాకుండా విడుదల అనంతరం ఎన్నో వివాదాలు ఎదుర్కోవలసి వచ్చింది ఇందుకోసమే నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సైతం ఈడీ విచారణను ఎదుర్కొన్నారు..