Aamir Khan : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభిన్న కథనాలు, విలక్షణమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో అమీర్ ఖాన్. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా అమీర్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అమీర్ చివరిగా ప్రేక్షకులు ముందుకు ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో వచ్చాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 10 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడినా.. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
35 ఏళ్లగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నా, దాని వల్ల నేను నా తల్లితో మరియు కుటుంబంతో తగినంత సమయం గడపక లేకపోతున్నా. నేను ఇప్పుడు చాలా పశ్చాత్తాపం పడుతున్న” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అమీర్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో.. వచ్చే ఏడాదిన్నర పాటు సినిమాలో నటించను అని వెల్లడించాడు. లాల్ సింగ్ చద్దా సినిమా తరువాత అమీర్… ఛాంపియన్స్ అనే సినిమా తియ్యాల్సి ఉంది. అది మంచి స్క్రిప్ట్ కానీ నేను ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.
నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు నేను వాళ్ళ పక్కన లేను. ఇప్పుడు నేను వాళ్లతో కొంత సమయం గడిపి ఆ ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే అమీర్ అమ్మ గారు అనారోగ్యంతో హాస్పిటల్ జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ ఇటీవలే తన భార్య కిరణ్ రావ్ తో దాదాపుగా 16 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్నాడు.