Entertainment క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో కనిపించే అలరించిన నటుడు చంద్రమోహన్.. అయితే ఆయన తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తాజాగా చెప్పుకొచ్చారు..
నటుడు చంద్రమోహన్ దాదాపు దాని కెరియర్ 300 పైగా చిత్రాలను నటించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.. అయితే దాసరి తనకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఆయన.. ఇందులో ముఖ్యంగా తన కూతుర్లను సినీ రంగానికి తీసుకురాకపోవడానికి అసలు కారణమేంటో వివరించారు..
గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రమోహన్ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఆయన తర్వాత తన కుటుంబం నుంచి ఒక్కరు కూడా సినిమాల్లోకి రాలేదు. అయితే తనకు ఇద్దరు కూతురులు ఉన్నారని.. ఇద్దరమ్మాయిలు చూడటానికి చక్కగా అందంగా ఉంటారని తెలిపారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటారని అన్నారు. వాళ్లను చిన్నప్పుడు చూసిన నటి భానుమతి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని పేర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం చేద్దామని అడిగారని చెప్పారట. కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అడుగుతారని భయం వేసేదని.. సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నట్లు వెల్లడించారు.. ఇద్దరూ చదువుల్లో బాగా రాణించారని గోల్డ్ మెడలిస్ట్లు అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఎంతో ఆనందంగా ఉన్నానని జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాను అంటే చెప్పుకొచ్చారు