Sarath Kumar : నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య… క్రాక్ తో సాలిడ్ సక్సెస్ అందుకున్న గోపిచంద్ మలినేని కలిసి ఈ మూవీ చేస్తుండడం పట్ల ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అలానే ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా… థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో తమిళ హీరో శరత్ కుమార్ సందడి చేశారు. ఆయన ఈ సినిమా షూటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేగాక బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోవడం ఖాయమని శరత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
శరత్ కుమార్ బాలయ్య సినిమా సెట్స్‌లో సందడి చేయడంతో, దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో పలు వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.