Actor Surya : తమిళ స్టార్ హీరో సూర్య అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకొని తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సూర్య. సూర్య కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులకు అతడిని దగ్గర చేసిన సినిమాలు మాత్రం గజినీ, యముడు మాత్రమే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా యముడు లో సూర్య నటన అద్భుతమని చెప్పాలి. డైరెక్టర్ హరి, సూర్య కాంబినేషన్లో వచ్చిన సింగం సినిమాలు ఏ రేంజ్లో హిట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సూర్య త్వరలోనే సింగం 4 ను మొదలుపెట్టనున్నాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరి.. సింగం 4 ను ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట. పవర్ ఫుల్ కాప్ ను మళ్లీ బయటికి తీసుకురావడానికి మరింత పవర్ ఫుల్ స్టోరీని రాసుకున్నాడట. సూర్య సైతం ఈ కథను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సూర్య ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. హరి కూడా మరో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి కనీసం 6 నెలలు అయినా పడుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సూర్య ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి. మరి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఇక లాక్ డౌన్ టైమ్‌లో డిజిటల్ రిలీజ్ అయిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్య ఇమేజ్‌ను తారా స్థాయికి చేర్చాయి. దీంతో ఈ స్టార్ హీరో థియేట్రికల్ రిలీజ్‌ల విషయంలో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఆల్రెడీ వాడివసల్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన సూర్య… బాల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. శివపుత్రుడు సినిమాలో సూర్యను డిఫరెంట్‌గా చూపించిన బాలా… ఇప్పుడు మరోసారి ఈ హీరోను తెర మీద కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు.