Entertainment దాదాపు మూడు తరాల హీరోలతో నటించిన ఘనత హాస్యనటి రమాప్రభ ది తన జీవితంలో దాదాపు 1400కు పైగా సినిమాల్లో నటించిన ఈమె ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఇప్పటికీ కొన్ని కోట్ల ఆస్తిని వెనకేసుకొని ఉండేది. అయితే అనుకోని కారణాలవల్ల కొందరిని నమ్మి తన ఆశ మొత్తాన్ని పోగొట్టుకున్న ఈమె ప్రస్తుతం జీవనాన్ని గడపడానికి కూడా ఇబ్బందిపడుతుంది ఈ విషయం తెలుసుకున్న ఓ డైరెక్టర్ ఆమెకు ప్రతినెలా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు అంటూ తెలుపుకొచ్చింది..
హాస్యనటిమని రమాప్రభ.. 1966 నుండి 2015 వరకు నిర్విరామంగా సినిమాలలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది అయితే తన జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నానని.. నమ్మించి తన ఆస్తిని మొత్తం అతని పేరు మీద రాసేసుకున్నాడని.. ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.. అయితే ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు స్టార్ డైరెక్టర్ ఆదుకుంటున్నాడని తెలిపింది..
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అతను డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బద్రి సినిమా నుంచి దర్శకుడు పూరీ బాబుతో అనుబంధం ఉంది. ఇది జన్మజన్మల బంధంగా భావిస్తుంటాను. ఆ బాబానే నాకు ఈ బంధం ఏర్పరిచారని అనుకుంటాను.. ఒకరోజు అతను నీ పుట్టినరోజు ఎప్పుడు అని నన్ను అడక్క 5 అని చెప్పాను.. దాంతో ప్రతి నెల ఐదో తారీకు లోగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని చెప్పి అప్పటినుంచి ఈరోజు వరకు నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు .” అని చెప్పుకొచ్చింది..