Hit 2 : నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన ” హిట్ ” సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రూపొందుతుంది. ఆ చిత్రంలో అడివి శేష్ హీరోగా… మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. తాజాగా ఇప్పుడు హిట్ 2 ట్రైలర్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లో ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేయడంతో కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. హీరో ఈ కేసుని చాలా సింపుల్ గా తీసుకుంటాడు. హంతకుడిని త్వరగా పట్టుకుంటానని అంటాడు.
ఈ లోపు హంతకుడు నరికి పెట్టిన అమ్మాయి బాడీ పార్ట్శ్ ఒక్కోటి ఒక్కొక్కరివి అని తెలియడంతో అంతా షాక్ అవుతారు. అంతేకాకుండా హంతకుడు ఇంకో మర్డర్ కూడా చేయడానికి రెడీ అవుతాడు. మరి శేష్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అన్నది తెరపై చూడాలి. మొదటి సినిమాలాగే ఇది కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలు ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
అలాగే హిట్ వర్స్ కాన్సెప్ట్ తో వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఒక్కో సినిమాలో ఒక్కో హీరో ఉండనున్నట్టు, మధ్యలో ఆ హీరోలు కలవొచ్చు అన్నట్టు దర్శకుడు శైలేష్ కొలను చెప్పడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అడివి శేష్ కి ఈ సినిమా మరో హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.