Movie యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. అఖిల్ కెరీర్ కోసం నాగర్జున ఎంతగా ట్రై చేస్తున్నా ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఏజెంట్ మూవీతో హిట్టు కొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ హీరో..
అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ కోసం తన శరీరాన్ని కూడా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ తో రఫ్ లుక్ లో కనిపించడానికి రెడీ అయిపోతున్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే ఇదంతా ఏజెంట్ మూవీ కోసమే కాదని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ కోసం నాగార్జున గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఇందుకు కరణ్ కూడా ఒప్పుకున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి.. ఇప్పటికే కరణ్ విజయ్ దేవరకొండ ను బాలీవుడ్ కు పరిచయం చేశారు. అయితే ఇప్పుడు అఖిల్ ను హిందీలో పరిచయం చేయటానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..
ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాను సుందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు మాపై భారీ అంచనాలు పెంచేసింది.. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది..మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవ్వనుంది. స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.