sugar : పొట్ట పెంచడం సులభమైన పనే.. కాని దాన్ని కరిగించడానికే చాలా కష్టపడాల్సి ఉంటుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి జిమ్‌లో చెమట చిందిస్తారు, డైటింగ్ ప్లాన్, యోగా, రన్నింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తూ కష్టపడుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ పెరగడానికి.. కొవ్వు అధికంగా ఉండే ఆహారం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా కారణం అవుతాయి. చక్కెర ఎక్కువ తింటే.. కడుపు చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది . షుగర్ ఎక్కువగా తింటే.. అది కొవ్వుగా మారుతుంది.
బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడానికి.. చక్కెరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రాసెస్ చేసిన షుగర్ తీసుకోవడం మానేసి సహజ చక్కెరలు తీసుకోవాలి . బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా వీటిని తీసుకోవచ్చు .
తేనె..
చక్కెరకు తేన అద్భుతమైన ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. తేనెలో విటమిన్ సి, బి, క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫ్యాట్ ఉండదు. ఇది బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, దీనిని తక్కువ మొత్తంలోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో అధిక స్థాయి ఫ్రక్టోజ్ ఉంటుంది.
బెల్లం..
మీరు పొట్టను కరిగించుకోవడానికి చక్కెరకు బదులుగా.. బెల్లం తీసుకోవచ్చు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, విటిమిన్ బి,సి, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అజీర్తి, మలబద్దకం, నెలసరిలో చిక్కులు, రక్తహీనత లాంటి సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోజు కొంచెం బెల్లం తీంటే.. హైబీపీ తగ్గుతుంది. అయితే మీరు తక్కువ మొత్తంలోనే దీనిని తీసుకోవాలి.
ఖర్జూరం..
ఖర్జూరం పోషకాల స్టోర్ హౌస్. ఖర్జూరంలో ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లలో ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్, పాల్మిటోలిక్, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువును కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి.