Entertainment బాలీవుడ్ స్టార్ హీరో అమెరికా తన భార్య కిరణ్ రావు తో కొన్నాళ్ల క్రితం విభేదాలతో విడిపోయిన సంగతి తెలిసిందే.. ఈ జంట తాజాగా కలిసి ఓ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రూటే వేరు.. అందరికంటే వైవిధ్యంగా వెళుతూ ఉంటారు.. సినిమాల ఎంపిక నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అతను తీసుకునే నిర్ణయాలు.. చేసే పనులు ప్రత్యేకంగా ఉంటాయి.. అలాగే ఆయన గత కొంతకాలం క్రితం తన భార్య కిరణ్ రావు తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. 15 ఏళ్ల వివాహ బంధానికి వీరు ముగింపు చెబుతూ విడిపోయారు.. అయితే విడాకులు అనంతరం కూడా మేమిద్దరం స్నేహితుల ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటామని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.. అనంతరం తమ కొడుకు కోసం కోపేరెంట్స్ కొనసాగుతున్నారు.. అయితే ఈ జంట రీసెంట్‌గా కలిసి తమ ప్రొడక్షన్ హౌస్లో కలశ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఆఫీస్ సిబ్బందితో పాటు లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైత్ చందన్ హాజరయ్యారు. అయితే ఈ ఫోటోలను అమీరే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.. కాగా ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.. ఈ వేడుకలో అమీర్ తలకు నెహ్రూ క్యాప్ ధరించి భుజాలపై కండువా వేసుకున్నారు.. ఈ ఫొటోస్ చూసిన ఆయన అభిమానులు… నిజంగా ఆమీర్ ఖాన్‌ను ఇలా చూసి ఆశ్చర్యపోయాను. ఇవి హార్ట్ టచింగ్ మూమెంట్స్ అని కామెంట్ చేశాడు. మరొక అభిమాని.. ఆమీర్, కిరణ్ రావు జంటగా చాలా అందంగా ఉన్నారని, వారిద్దరినీ ఎప్పుడూ ప్రేమిస్తానని అన్నాడు.. అలాగే ఈ అందమైన జంట ఎందుకు విడిపోయారు అసలు అంటూ కామెంట్లు పెడుతున్నారు..