Entertainment బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన కుమారుడా ఆర్యన్ కన్ను తొందరలోనే హీరోగా పరిచయం చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ అలా కాకుండా ఓ షాకింగ్ డెసిషన్ తో ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు షారుఖ్..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు..సాధారణంగా హీరోలు కొడుకులు హీరోలు గానే సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు కానీ ఇక్కడ ఆర్యన్ మాత్రం అలా చేయడం లేదు.. ఆర్యన్ బాలీవుడ్లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ విషయాన్ని షారుక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు… షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తొలి ప్రాజెక్ట్ చేయనున్నాడు ఆర్యన్ ఖాన్..
ఈ మేరకు ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసిన ఆర్యన్ “స్క్రిప్ట్ రాయడం పూర్తయింది. యాక్షన్ ఎప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తున్నా” అని రాసుకొచ్చాడు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతే కాకుండా తండ్రి కొడుకులు మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరికీ బలే ముచ్చట అనిపిస్తుంది..
ఈ పోస్ట్ కు షారుక్ స్పందిస్తూ.. “వావ్.. ఇప్పటి వరకు ఆలోచించావు, నీపై నమ్మకం పెంచుకున్నావు, ఎన్నో కలలు కన్నావు. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. తొలి ప్రాజెక్టు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఆల్ ది బెస్ట్” అని కామెంట్ చేయగా… ఇక షారుక్ భార్య గౌరీ ఖాన్ మాట్లాడుతూ “నీ తొలి ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. అలాగే ఈ సందర్భంగా ఆర్యన్… ‘నాన్న.. సెట్‌లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను’ అని అడగ్గా.. ‘అలా అయితే మీ షూటింగ్ కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉండాలి. ఉదయం వేళలో కాదు’ అంటూ షారుక్ చమత్కరించారు. ‘ఓకే.. కేవలం రాత్రి పూట మాత్రమే షూటింగ్ చేస్తా..’ అంటూ బదులిచ్చాడు ఆర్యన్.