Entertainment టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి ఆశా షైనీ నువ్వు నాకు నచ్చావ్.. రసింహారాయుడు, మారాజు వంటి చిత్రాలతో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆశా.. తాజాగా తన జీవితంలో జరిగిన భయంకర సంఘటన గుర్తు చేసుకుంది..
హీరోయిన్ ఆశాషైనీ తనను తన బాయ్ ఫ్రెండ్ ఎంతగానో చిత్రహింసలకు గురి చేశాడని చెప్పుకొచ్చింది.. నమ్మి ప్రేమించిన వ్యక్తి తనను ఎంతగా హింసించాడో చెప్పుకోవచ్చు.. అతడి చేతిలో తను ఎంతటి నరకాన్ని అనుభవించిందో తెలిపింది.. ఈమె తన ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో చిత్ర హింసలు అనుభవించారట. కనికరం లేకుండా తన్నేవాడట. ఒకరోజు తనకి భయపడి ఒంటిపై బట్టలు ఉన్నాయ్యో లేవో కూడా చూసుకోకుండా బయటకు పరుగెత్తిందట. అతడు తనను తీవ్రంగా కొట్టేవాడట. గౌరంగ్ జోషి దెబ్బలకు ఒకసారి తన దవడ విరిగిపోయిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ దారుణ సంఘటనలు ఆషా షైనీ బయటపెట్టారు. 2007లో ఈ సంఘటన జరినట్లు 2018లో ఆశా షైనీ వెల్లడించారు. గాయాలపాలైన తన ఫోటోలు విడుదల చేశారు. ఇటీవల ఆనాటి భయానక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు
అయితే ఆశ చండీగర్ కు చెందిన అమ్మాయి మోడల్ గా తెలియని ప్రారంభించి తెలుగులో వినీత్ హీరోగా నటించిన ప్రేమ కోసం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయింది.. అలాగే తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన మారాజు చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది.. అలాగే తెలుగుతోపాటు వాళ్ళు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన ఈ మామ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది