Entertainment సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కోసం ఇప్పటికే పలువురు నటీనటులు మాట్లాడిన సంగతి తెలిసిందే కొంతమంది ఈ విషయాన్ని బహిర్గతంగానే తెలిపారు ఇప్పటికీ కూడా మీ టు మొదలయ్యి కొన్ని ఏళ్ళు అయినప్పటికీ మరికొందరు హీరోయిన్లు తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చెప్పుకొస్తున్నారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు భోజ్పురి హీరోయిన్ యామిని సింగ్..
భోజ్పురి హీరోయిన్ యామిని సింగ్ తాజాగా వైరల్ కామెంట్స్ చేశారు.. ఓ స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడు అంటూ తెలిపారు..
తాజాగా ఈ విషయంపై మాట్లాడిన యామినీ సింగ్.. “హీరో పవన్ సింగ్‌తో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్‌కు సరైన పాత్రలు ఉండవు. పవన్ సింగ్ పైకి కనిపించే వ్యక్తి కాదు.. ఆయనలో మరో షేడ్ కూడా ఉంది. పవన్ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడి నిజ స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు.. ‘సినిమా చేయాలని ఉందా? లేదా?’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ‘ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే’ అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను. పవన్ సింగ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే..” అంటూ చెప్పకు వచ్చింది ఈ హీరోయిన్..